పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఏసీబీ రైడ్స్.. ఇరిగేషన్ ఏఈ అరెస్టు!

-

రాష్ట్రంలో ఇటవలి కాలంలో ఏసీబీ అధికారుల దాడులు పెరిగాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో సంపాదిస్తున్నందున వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మాటు వేసి మరీ వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు.

ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ వరుసగా దాడులు చేస్తున్నా అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదని, సరైనా పత్రాలు ఉన్నా అనుమతులు ఇవ్వకుండా లంచాల కోసం వేధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version