రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు అని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు అని అన్నారు. జగన్ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది ప్రభుత్వం అని ఆయన అన్నారు.
రాప్తాడులో జగన్ సభకు హైవే ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేశారన్నారు. వారం ముందు నుంచే హైవేపై రాకపోకలపై ఆంక్షలు అధికారులు విధిస్తున్నారన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లలేని పరిస్థితిని జగన్ రెడ్డి కల్పించారన్నారు. వైసీపీ ఆగడాలు ఇంకెంత కాలమో సాగవు. వాళ్లకు కౌంట్ డౌన్ మొదలైంది అని అన్నారు.