సీనియర్లను ఐవిఆర్ఎస్ సర్వే పేరుతో పక్కన పెడుతున్న బాబు.. అగ్రహాంతో ఆ మహిళా నేత..

-

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్టు ఫైట్ జరుగుతోంది. అధినేత తమకు టికెట్ ఇస్తారని పార్టీ సీనియర్లు భావిస్తుంటే చంద్రబాబు మాత్రం మరోలా ఆలోచనలు చేస్తున్నారట. జనాల్లో ఉండే నేతలకంటే ఆర్థికంగా బలంగా ఉండే నేతలకు టికెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. దీంతో పార్టీని నమ్ముకున్న సీనియర్లకు వెన్నుపోటు తప్పదా అనే ప్రచారం జరుగుతుంది. తనకు కావలసినవారికి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు IVRS సర్వే పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారట..

కాకినాడ అర్బన్ టిడిపిలో చంద్రబాబుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐ వి ఆర్ ఎస్ సర్వే పేరుతో సీనియర్లను చంద్రబాబు పక్కన పెడుతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన అన్న కోడలు సుస్మిత, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన తాతారావు, పేర్లు రావడంతో టిక్కెట్ ఆశిస్తున్న కొండబాబుకు దిమ్మతిరిగినంత పనైందట. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకినాడ టౌన్ లో అన్న సత్యనారాయణ హవా ఎక్కువగా ఉండేదట..

వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యనారాయణ సైలెంట్ అవ్వగా కొండబాబు మాత్రం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కొండబాబుకు టికెట్ రాకుండా తన కోడలికి టికెట్ ఇప్పించుకునేందుకు సత్యనారాయణ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం చంద్రబాబు నాయుడుతో ఆయన చర్చలు జరిపి తన కోడలికి టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారట.. దీంతో ఐవిఆర్ఎస్ సర్వేలో సుస్మిత పేరు కూడా వచ్చిందని టిడిపి నేతలు చెబుతున్నారు.

తమ కుటుంబంలో చంద్రబాబు నాయుడు చీలికలు తెస్తున్నారని.. తనకు టికెట్ ఇవ్వకుండా తన అన్న కోడలికి టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొండబాబు ఆగ్రహంతో ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోతే తన సత్తా ఏంటో చూపిస్తానని కొండబాబు తన అనుచరుల వద్ద చెబుతున్నారట. మరోపక్క మాజీ మేయర్ సుంకర పావని కూడా టికెట్ ఆశిస్తూ ఉండడం ఆమె పేరు ఐవిఆర్ఎస్ సర్వేలో లేకపోవడంతో ఆమె చంద్రబాబు నాయుడు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. మహిళలకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేదని ఆమె గుర్రుగా ఉన్నారని టీడీపీ లో టాక్ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news