గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు నిర్వహించిన సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. సభ ప్రాంగణంలో ఒక్కసారి తోపులాట జరుగగా తొక్కిసలాట జరిగింది. అయితే.. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా.. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు అధికారులు. అయితే.. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న వారిలో మరో ఇద్దరు మృతిచెందారు. మృతులు గోపిశెల్లి రమాదేవి, ఆసియాగా తెలుస్తోంది. దీంతో సభా నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందూకురులో నిర్వహించిన చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అమాయకులు చనిపోవడం బాధకరమంటూ పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధిలా అండగా ఉంటామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న గుడంకట్ట ఔట్లేట్ కాలువలో పడిపోయారు. దీంతో వారిని హుటాహుటిన అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు.