సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా ‘టిల్లు 2 ను తీసుకొని వస్తున్నారు.అయితే ఈ సినిమా పై వరసగా వివాదాలే వస్తున్నాయి. ఇందులో మొదట పార్ట్ లో హాట్ గా నటించి సినిమాకు మంచి ప్లస్ అయిన నేహాశెట్టికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఆమె బదులుగా కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వన్ తీసుకున్నారు.
ఇక ఆమె కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చింది. ఆమె ప్లేస్ లో మలయాళ బ్యూటీ ‘మడోనా సెబాస్టియన్ ‘మీనాక్షీ చౌదరి ఆప్షన్ గా అనుకున్నారు. కాని అవేమీ వర్క్ అవుట్ కాలేదు.మళ్లీ అనుపమ నే పెర్ఫెక్ట్ అని మళ్లీ ఆమెనే అడుగుతున్నారని తెలుస్తోంది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా డీజే టిల్లు 2 సినిమా యొక్క పోస్టర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో వెల్ కమ్ టు టిల్లు ఈవెంట్స్ అంటూ సిద్దు హంగామా చేస్తున్నాడు. ఈ పోస్టర్ లో కలర్ ఫుల్ గా ఉన్నాడు. మొదటి పార్ట్ లో చిన్న ఫంక్షన్స్ కు డి జే కొట్టిన టిల్లు ఇప్పుడు ఈవెంట్స్ బాట పట్టాడు. ఈ సినిమా హీరోయిన్ వివాదం ఎలా ఉన్నా కూడా సిద్దుకు సినిమా నిర్మాణం లో ఫుల్ పవర్స్ ఇచ్చారని తెలుస్తోంది. అనుకున్న టైమ్ కల్లా రిలీజ్ కోసం గాట్టిగా ప్రయత్నం చేస్తూఉన్నారని తెలుస్తోంది.