లాస్ ఏంజిల్స్ లో ప్రియుడుతో నిశ్చితార్థం చేసుకున్న షారుక్ కూతురు..

-

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కుచ్​కుచ్​ హోతాహై చిత్రంలో షారుక్ ఖాన్ రాణి ముఖర్జీ కూతురుగా కనిపించిన పాప గుర్తుందా ఆ పాప అంజలి అయితే అసలు పేరు సనా సహిద్ ఆ చిత్రంలో తన నటనతో ఎంతో మంచి మార్కులు సంపాదించుకుంది అయితే తాజాగా ఈమె న్యూ ఇయర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది…

కుచ్ కుచ్ హోతా హై సినిమా పాప సనా సయీద్ కొత్త సంవత్సరంతో సర్ప్రైజ్ ఇచ్చింది అమెరికాలో ఉన్న తన ప్రియుడు సబా వాగ్నర్​తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. సనా ప్రియుడు లాస్ ఏంజెల్స్ లో సౌండ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే వస్తున్నారు..

కుచ్ కుచ్ హోతా హై 1988 లో విడుదల అయ్యింది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై యష్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు.. ఈ సినిమాలో షారుక్ ఖాన్, రాణి ముఖర్జీ, కాజోల్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మంచి పేరు సంపాదించుకున్న సన సినిమా హిట్ అయిన అవకాశాలను అందిపుచ్చుకుంది ఈ చిత్రం తర్వాత రాణి ముఖర్జీతో కలిసి మరో సినిమాలో నటించింది అలాగే ఆ తర్వాత తరం జోహార్ దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో కూడా నటించింది సనా.. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది.. 2012 తర్వాత సనా అనేక టెలివిజన్, రియాల్టీ షోలలో కూడా కనిపించి అలరించింది..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version