గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిని ఫైర్ ఇంజిన్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది.
ఈ ఘటన హైదరాబాద్ ఉప్పర్‌పల్లి పిల్లర్ నంబర్ 166 వద్ద బుధవారం ఉదయం సంభవించింది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న డాక్టర్ సోహా ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి గాయాలపాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.