కరోనా కంటే ప్రమాదకరమైన పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్ కాదు : ఆది శ్రీనివాస్

-

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాక.. ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎల్లుండికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు.

‘కరోనా కంటే ప్రమాదకరమైన పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్ కాదు. అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ ఉంది. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే దానిపై కూడా కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ స్కాములు చేసి వేల కోట్ల దోచుకున్న వాళ్లు కూడా సీఎం రేవంత్ గురించి మాట్లాడుతున్నారు’ అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news