తెలంగాణ అప్పు రూ.4,37,000 కోట్లు మాత్రమే – కవిత

-

తెలంగాణ రాష్ట్రం అప్పు 2014 నుండి ఈరోజు వరకు రూ.4,37,000 కోట్లు అని బడ్జెట్లో పేర్కొన్నారన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ తరుణంలోనే… కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్ని అసత్య ప్రచారాలని ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయిందని వెల్లడించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

kavitha on budget 2025

బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అంటూ చురకలు అంటించారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప ఏలాంటి నిజాలు లేవని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం కట్టిన అప్పు 30 వేల కోట్లు మాత్రమే.. కానీ లక్ష 40,000 కోట్లు అప్పు కట్టినమని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 4,37,000 కోట్ల అప్పు అన్నారు. కానీ ఏడు లక్షల కోట్ల అప్పు అని కెసిఆర్ ప్రభుత్వం పై నిందలు వేశారన్నారు. బడ్జెట్ బుక్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలని తేలిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news