బిగ్ బ్రేకింగ్: అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు!

-

ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్న.. ఆరోగ్య కారణాల దృష్ట్యా కోర్టు అనుమతితో హాస్పటల్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో… ఏసీబీ అధికారుల విచారణను కూడా హాస్పటల్ లోనే, అచ్చెన్న ఉంటున్న గదిలోనే చేయాలని కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దానికి ఒక కారణం కరోనా కాగా మరో కారణం అచ్చెన్నకు బీపీ పెరిగిందంట!

అవును… అచ్చెన్న ఉంటున్న జీజీహెచ్ లో కరోనా వ్యాప్తి చెందుతుందన్న వార్త టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేసిందంట. ఈ హాస్పటల్ లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకిందన్న వార్తలతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయట. ఈ క్రమంలో జీజీహెచ్ ‌కు చేరుకుంటున్న టీడీపీ నేతలు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగితెలుసుకుంటున్నారంట. ఇదే క్రమంలో వైద్యులను కలిసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారట.

కరోనా సంగతి అలా ఉంటే… మరోవైపు అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. ఆయనకు బీపీ పెరగడం, షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోవడం జరిగాయంట. ఇదే క్రమంలో నడుమునొప్పితో కూడా బాధపడుతున్నారని, మరోవైపు కొత్తగా కరోనా భయం పట్టుకుందని అంతున్నారు! ఓ వైపు కరోనా కేసుల భయం.. మరోవైపు ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version