భలే.. కోవిడ్‌ పేషెంట్ల కోసం స్పెషల్‌ బెడ్‌..!

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలన్నింటిలో ఇప్పుడు బెడ్ల కొరత ఏర్పడుతోంది. కోవిడ్‌ పేషెంట్లకే కాదు, క్వారంటైన్‌ సెంటర్లలో ఉంటున్న వారికి కూడా బెడ్లను ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. అయితే ఈ సమస్యకు ఒడిశాకు చెందిన ఓ యువ మెకానిక్‌ పరిష్కారం కనుగొన్నాడు.

ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌ స్వెయిన్‌ అనే ఓ యువ మెకానిక్‌ కోవిడ్‌ పేషెంట్ల కోసం ఓ ప్రత్యేక సోలార్‌ ఆధారిత  బెడ్‌ను రూపొందించాడు. ఆ బెడ్‌ చుట్టూ దోమ తెరను పోలిన ఓ గ్లాస్‌ నిర్మాణం ఉంటుంది. అది పారదర్శకంగా ఉంటుంది. అందువల్ల బెడ్‌పై ఉన్నవారు బయటకు కనిపిస్తారు. అయితే అందులోకి ఆక్సిజన్‌ను పంపేందుకు.. అందులో నిండే కార్బన్‌ డయాక్సైడ్‌ బయటకు వెళ్లేందుకు గాను ప్రత్యేక ఏర్పాటు చేశాడు. పైపుల ద్వారా గాలి లోపలికి, బయటకు వెళ్తుంది.

కాగా కోవిడ్‌ పేషెంట్లు ప్రస్తుతం ఓపెన్‌ టైప్‌ బెడ్లపై ఉంటున్నారు. దీంతో వారి దగ్గరకు వెళ్లే వారికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సంతోష్‌ తయారు చేసిన ఈ బెడ్‌ వల్ల కరోనా రిస్క్‌ తగ్గుతుంది. ఇక ఈ బెడ్‌ను ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. లేదా పరికరాలు ఉంటే అక్కడికక్కడే ఈ బెడ్‌ను తయారు చేయవచ్చు. అయితే సంతోష్‌కు ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. దీంతో అతను ప్రస్తుతం ఇలాంటి బెడ్లను తయారు చేసి అందించే పనిలో పడ్డాడు. అయితే ఇతను ఇదే కాదు గతంలో ఓ సోలార్‌ హీటర్‌, సోలార్‌ ఆధారిత శానిటైజింగ్‌ మెషిన్‌లను కూడా తయారు చేశాడు. ఇంత చేసినా అతను స్కూల్‌ డ్రాపవుట్‌ స్టూడెంట్‌ అంటే ఎవరూ నమ్మరు. అవును మరి.. టాలెంట్‌ అనేది ఎవరి సొత్తూ కాదు. అందుకు చదువుతో పనిలేదు. సరిగ్గా ఇదే విషయాన్ని సంతోష్‌ ఇప్పుడు రుజువు చేశాడు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version