ఆర్జీవీకి పూన‌మ్ కౌంట‌ర్..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి పూనమ్ కౌర్ ఫైర్ అయ్యారు. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. వర్మ తన సినిమా గురించి ప్రకటించిన వెంటనే పూనమ్ స్పందించింది. ఈ సినిమాలో ఆర్జీవీ కూడా జత చేయండని కోరింది. అమ్మాయిల బలహీనతలు తెలుసుకుని, వారిని తీవ్ర దూషణలు చేసేలా రెచ్చగొట్టడం, మళ్లీ ట్వీట్ల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం లాంటివి చేసే వాడి పాత్రను కూడా పెట్టండని తెలిపింది. తాను నిన్న చిన్నతనంలో ఎంతో గౌరవించానని, కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది.

ఓ డైరెక్టర్ ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని తన బ్రెయిన్‌ ను దాదాపు గంటసేపు వాష్ చేశాడని గతంలో జరిగిన విషయాలను తవ్వింది పూనమ్ కౌర్. తనకు ఆ డైరెక్టర్ పంపిన ఆ మెసెజ్‌ లను సదరు పార్టీ ప్రతినిధులకు పంపానని తెలిపింది. అతని దురద్దేశాన్ని తనకు కొందరు మీడియా వారు తెలియజేశారని, కొందరైనా నిజాయితీ వ్యక్తులు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలను తెలిపింది.

‘జియా ఖాన్ మరణం వెనుకున్న రహస్యాలు తెలుసుకోవాలి, ఇండస్ట్రీలోని నిజానిజాలు బయట పెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఆమె తల్లి బాధను అర్థం చేసుకున్నారని అనుకుంటాను.. మీకు వారెవ్వరూ ఫండ్ ఇవ్వరు.. మీకు దానితో ఎలాంటి లాభం ఉండదు..కాబట్టి మీరు వారిపై సినిమాలు తీయరు’ అని పూనమ్ కౌర్ చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version