టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ కొరటాల శివ మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ” ఆచార్య”. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజ్ అగర్వాల్ నటిస్తుండగా.. మరో జంటగా రామ్ చరణ్ – పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలో తాజాగా అప్డేట్ వదిలింది ఆచార్య చిత్రయూనిట్. ”నీలాంబరి” అనే సాంగ్ ఫుల్ సాంగ్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నీలాంబరి సాంగ్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే ల మధ్య… రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కింది. అలాగే… నీలాంబరి అని సాగే ఈ పాట.. లిరిక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. కాగా.. ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కానుంది.