తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది..ఆచార్య సినిమా.. ఇద్దరు మెగా హీరోలు నటించిన సినిమా కావడంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతూన్నాయి.. దాంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో నటించారు. గతంలో ఈ తండ్రీ కొడుకులు కొన్ని సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నా కూడా ఆచార్య అంత క్రేజ్ అయితే రాలేదు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు..హీరో, హీరోయిన్లు మధ్య సన్నీవేశాల దగ్గర నుంచి, యాక్షన్ సీన్స్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నింటినీ చక్కగా ప్రజెంట్ చేశారు.
చిరంజీవి, రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ మీద ఒకే సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలలో చూడాలని అనుకున్న వారి ఆశ నెరవేరింది. ఆ విధంగా ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమా థియెటర్ల లోకి వచ్చే వరకూ సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్డేట్ సినిమాకు మంచి హిట్ టాక్ ను అందించింది. కాజల్, పూజాహెగ్డే లు హీరోయిన్లుగా నటించారు. అయితే కొన్ని సన్నీవేశాలకు కాజల్ పాత్ర అడ్డురావడంతో ఆమె పాత్రను తీసేశారు. ఇక పూజా పాత్ర గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది.గ్రామీణ యువతిగా కనిపించిన పూజా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదన్న వాదన వినిపిస్తోంది.
ఇకపొతే.. కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు ఉండటం సినిమాకు మైనస్ అని సినీ అభిమానులు చెబుతున్నారు..రామ్ చరణ్ యాక్టింగ్ సినిమాకు హైలెట్ కాగా, మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.లాహె లాహె సాంగ్ లో చిరంజీవి డ్యాన్స్ హైలెట్ అయ్యాయి.సాంగ్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ ను తీసుకువచ్చాయి. తండ్రీకొడుకులు పోటీ పడి మరి ఫైట్ చేసారని సినిమాను చూస్తే తెలుస్తుంది. మొత్తానికి ఫస్ట్ షో కు సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే టాక్ ను అందుకుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న కథ పరంగా సినిమా జనాలను ఆకట్టుకుంటోంది..కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ చేస్తుందో తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే..