చిరంజీవి, రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్…. ‘ఆచార్య’ ట్విట్టర్ రివ్యూ

-

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి ‘ సైరా’ తరువాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకు సూపర్ హిట్లే తప్పితే… ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ అంచనాలు మరింగా పెరిగాయి. దీనికి తోడు రామ్ చరణ్, చిరంజీవితో కలిసి నటిస్తుండటంతో ఇక మెగా అభిమానులకు పండగే. ఎప్రిల్ 29న థియేటర్లలోకి రాబోతోంది.

అయితే… మెగా అభిమానులకు ఇప్పటికే ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఓవర్సీస్, ట్విట్టర్ రివ్యూ సూపర్ గా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చినట్లుగా రివ్యూలు వస్తున్నాయి. ఉమైర్ సంధు ఆచార్య మూవీకి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్, చిరంజీవిని స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ మరింతగా అలరించే అవకాశం ఉంది. కొరటాల మార్క్ డైలాగ్స్, డైరెక్షన్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ‘ ఆచార్య’కు ప్లస్ అవనున్నాయి. ట్విట్టర్ రివ్యూ ప్రకారం చిరంజీవి ఖాతాలో మరో భారీ విజయం నమోదు కానుంది. ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version