బ్రేకింగ్ : అచ్చెన్నాయుడు అరెస్ట్

-

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిన్న కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ లో అచ్చెన్నాయుడు పై కేసు నమోదైంది. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడు మీద ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు.. కేసు దర్యాప్తు నిమిత్తం అచ్చెన్నాయుడు ని కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది.

atchannaidu

మొన్న నామినేషన్ల చివరి రోజున నిమ్మాడలో హైడ్రామా చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు బంధువు వైసీపీ తరపున నామినేషన్ వేయడానికి సిద్ధం అయ్యారు. అయితే అచ్చెన్నాయుడు సోదరుడు, లోకల్ టీడీపీ నేతలు అతనిని నామినేషన్ వేయకుండా చేయడానికి సర్వ శక్తిలా ప్రయత్నించారు. దీంతో అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అచ్చెన్న అంతకు ముందే ఫోన్ లో మాట్లాడడంతో ఆ కాల్ రికార్డ్ ని బేస్ చేసుకుని పోలీస్ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version