యోగాతో ఎన్నో ప్రయోజనాలుని మనం పొందొచ్చు. ఎసిడిటీ వంటి సమస్యలు కూడా యోగతో దూరం చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి వాటి కోసం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడిని అధిగమించడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది.
దానితో పాటుగా అనేక రకాల అనారోగ్య సమస్యలను యోగతో పరిష్కారం చేసుకోవచ్చు. అయితే ఎసిడిటీని పోగొట్టుకోవడానికి కొన్ని ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.
వజ్రాసనం:
వజ్రాసనం వేయడం వల్ల ఎసిడిటీ సమస్య ఉండదు అని నిపుణులు చెప్పడం జరిగింది. ప్రతి రోజు తినేసిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి వజ్రాసనం వేయడం వల్ల ఎసిడిటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రెగ్యులర్ గా వజ్రాసనం వేస్తే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అలానే బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా రాకుండా చూస్తుంది. ఇలా మీరు ఎసిడిటికి కూడా చెక్ పెట్టొచ్చు.
హలాసనం:
ఇది కూడా చాలా ముఖ్యమైన ఆసనం. ఈ ఆసనం వేయడం వల్ల మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు మరియు దృఢంగా ఉండొచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల భుజాలు మరియు మజిల్స్ చాలా ఫ్రీగా ఉంటాయి. అలానే ఇది జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి ఎసిడిటి సమస్యను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ ఆసనం కూడా వేస్తే మంచిది.
చాలా మంది నేటి కాలంలో ఎసిడిటీ సమస్యతో బాధ పడుతున్నారు. అటువంటి వాళ్ళు రెగ్యులర్ గా ఈ ఆసనాలు వేస్తే మంచిది. దీనితో పాటుగా ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం, గ్రీన్ టీ, పండ్ల రసాలు వంటి ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండటం చేయాలి.
ఎక్కువ కారం, మసాలా ఉంటే ఆహారం తినకుండా ఉంటే మంచిది. మంచి ఆకుకూరలు, తాజా పండ్లు డైట్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది. దానితో ఈ సమస్య మాయమైపోతుంది.