టీనేజ్‌లో పింపుల్స్ రావడం కామన్.. వయసులో ఉన్నారు కాబట్టి.. మనం ఎంత మంచి లైఫ్‌స్టైల్ మెయింటేన్ చేసినా.. వాటిపని అవి చేసుకుంటాయి. అయితే ఆ పింపుల్స్ వచ్చే సంఖ్యను, మచ్చలు పడుకుండా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. మరి టీనేజ్ దాటాకా కూడా వస్తే..? అవును చాలా మందికి టీనేజ్ దాటాక కూడా.. ఉద్యమంలా మొటిమలు దాడి చేస్తాయి.
దీనికి కారణం..మన లైఫ్‌సైలే.. ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్, వేపించినవి, జంక్ ఫుడ్స్ బాగా తినే వాళ్లకే.. ఇలా మొటిమలు వస్తాయి. అయితే టీనేజ్‌లో వచ్చే మొటిమల కంటే ఇవి కాస్త డెంజర్ అనే చెప్పాలి. పిల్ల మొటిమలు కాబట్టి వస్తాయి..కొన్నిరోజులకు పోతాయి..కానీ.. పెద్ద వయసులో వచ్చే మొటిమలు అలా కాదు.. వారాలు మొదలు నెలలు తరబడి ఉంటాయి. మరి వాటిని పోగోట్టేది ఎలా..? హోమ్ రెమిడీస్‌తో రిజల్ట్ ఉన్నప్పటికీ.. వెంటనే ఫలితం రావాలంటే ఈ క్రీమ్స్ ఓ సారి ట్రై చేయండి.!
టీనేజ్ దాటాకా వచ్చే మొటిమల కోసం..తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. మైల్డ్‌గా ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు.. శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి క్లెన్సర్స్ వాడాల్సి ఉంటుంది. ఇంకాస్త తీవ్రంగా ఉన్నయనిపిస్తే రెటినాయిడ్స్ వంటి పూత మందులు వాడాలి. స్వేద రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వస్తునప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి.
మరింత తీవ్రమైన మొటిమలకు రెటినాయిడ్స్‌తో పాటు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో ప్రయోజనం లేనప్పుడు నోటిద్వారా తీసుకునే ఓరల్ మెడిసిన్స్ డాక్టర్ సలహా మేరకు వాడాలి.
మొటిమలతో పాటు హార్మోన్ అసమతౌల్యతల్ని కూడా మనం చూసుకోవాలి. వాటి కోసం కొన్ని హార్మోన్ సంబంధిత మందులు వాడాల్సి ఉంటుంది. చికిత్సలు పూర్తయ్యాక.. మొటిమల తాలూకు మచ్చలు, గాట్లు పోవడానికి కెమికల్ పీల్స్, డర్మారోలర్, లేజర్ చికిత్సలు, మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది.
ఇలా మొటిమల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. మీకు వచ్చే మొటిమలు ఏ స్టేజ్‌లో ఉన్నాయో దాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు ఈ క్రీమ్స్ ట్రై చేయండి!
-Triveni Buskarowthu