సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ.. ఈ చెత్త నా కొడుకును చెప్పు తీస్కొని కొట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించిన తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి రండా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ….చెప్పు చూపిస్తూ సీఎం చెత్తనాకొడుకును చెప్పుతో కొట్టాలంటూ ‘పాగల్ గాడు, హౌ* గాడు. ఈ చెత్త నా కొడుకును చెప్పుతో కొట్టాలి. కానీ సంస్కారం అడ్డు వస్తోంది. బిడ్డా ఖబడ్డార్.. ఇంకోసారి మా కేసిఆర్ ను అంటే లక్షమందితో తొక్కుతాం..’ అని పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.