డిగ్రీ పరీక్షలు రాసిన టాలీవుడ్ ఫేమస్ నటి..!

-

చదువుకి వయస్సుకు సంబంధం లేదు అని చెబుతూ ఉంటారు. ఎంతో మంది వయస్సు దాటి పోయినప్పటికీ తమకంటూ ఒక విద్యార్హత ఉండాలి అనే కుతూహలంతో ఉంటారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది టాలీవుడ్ నటి హేమ. వయసు దాటిపోతే ఏంటి తన డిగ్రీని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి దరఖాస్తు చేసుకున్న హేమ… ఈరోజు నల్గొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో పరీక్షలు రాశారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె… ఎన్నో రోజులనుంచి డిగ్రీ పూర్తి చేయాలని అనుకున్నానని.. హైదరాబాద్లో అయితే తనను ఇతరులు గుర్తుపట్టి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నల్గొండలో పరీక్షలు రాసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నల్గొండ ప్రాంతంలో తమ బంధువులు కూడా ఉన్నారని అందుకే నల్గొండ లో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు నటి హేమ.

Read more RELATED
Recommended to you

Exit mobile version