రెండో పెళ్లి చేసుకోబోతున్న 40 ఏళ్లు దాటిన స్టార్‌ హీరో !

-

హీరో ప్రశాంత్‌ పేరు వినే ఉంటారు. జీన్స్, దొంగ దొంగ, జోడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో ప్రశాంత్‌. నిర్మాత త్యాగరాజన్‌ కొడుకుగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో అటు కోలీవుడ్‌ లోనూ.. ఇటు టాలీవుడ్‌ లోనూ తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల కాలంలో తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో కీలక పాత్ర కూడా పోషించారు హీరో ప్రశాంత్.

మరోవైపు ప్రశాంత్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారనేది ఈ వార్త సారాంశం. ప్రశాంత్‌ 2005 సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన గృహలక్ష్మినీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే పెళ్లైనా మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరు ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తన కుటుంబానికి పరిచయం ఉన్న ఓ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version