మరో వివాదంలో చిక్కుకున్న రజనీకాంత్..చెన్నై కార్పొరేషన్‌పై హైకోర్టుకు.

-

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో వివాదంలో చిక్కున్నాడు..చెన్నైలో తన కుటుంబానికి చెందిన రాఘవేంద్ర కళ్యాణ మండపానికి ఆస్తి పన్ను చెల్లించాలని చెన్నై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది..నోటీసులపై స్పందించిన రజనీకాంత్ తన కళ్యాణ మండపానికి క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నాని తెలిపారు..కరోనా లాక్డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా చెన్నైలో కళ్యాణ మండపం మూసివేశామని తెలిపారు సూపర్‌ స్టార్..మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకూ లాక్‌ డౌన్‌ కారణంగా దాని నుంచి ఎటువంటి ఆదాయాలు పొందలేదని పేర్కోన్నారు..తాజాగా ఇప్పుడు చైన్నై కార్పోరేషన్‌ రూ.6.50 లక్షల ఆస్తి పన్ను చెల్లించమని నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు..

చెన్నై కార్పొరేషన్ నోటీసుపై సవాలు చేస్తూ నటుడు రజనీకాంత్ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు..మార్చి 24 తర్వాత తన వివాహ మందిరానికి సంబంధించిన అన్ని బుకింగ్‌లను రద్దు చేశానని, ప్రభుత్వ సూచనల మేరకు ముందస్తు డబ్బును కూడా తిరిగి చెల్లించానని, ఆస్తిపన్నుపై ఉపశమనానికి అర్హుడని చెప్పాడు పిటిషన్‌లో పేర్కోన్నాడు..1919 యొక్క చెన్నై సిటీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం యొక్క సెక్షన్ 105 ప్రకారం 30 రోజుల పాటు ప్రాంగణం ఖాళీగా ఉండి, తనకు ప్రయోజనం లేనపప్పుడు పన్ను మినహాయింపు కోరవచ్చని తెలిపాడు..ఈ విషయంలో తాను సెప్టెంబర్ 23 న కార్పొరేషన్‌కు నోటీసు పంపానని, కానీ ఇప్పటి వరకు సమాధానం లేదని చెప్పారు..చెన్నై కార్పోరేషన్‌ జారీ చేసిన నోటీసును వెనక్కి తీసుకోనేలా కార్పోరేషన్‌కు దిశానిర్దేశం చేయాలని, అప్పటి వరకు జరిమానా విధించవద్దని పిటిషన్‌లో రజనీకాంత్ కోరాడు.

రజనీకాంత్ దాఖలు చేసిన కేసు ప్రకారం తన న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, అతను కళ్యాణ మండపానికి క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లిస్తున్నాడన్నాడు. ఈ పన్నును చివరిసారిగా ఫిబ్రవరి 14 న చెల్లించారు..కరోనాతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించవలసి వచ్చింది. తత్ఫలితంగా అతని వివాహ మందిరం ఖాళీగా ఉంది..మార్చి 24 నుండి ఎవరికీ అద్దెకు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితులలో నటుడు సెప్టెంబర్ 10న కార్పొరేషన్ నుండి ఆస్తిపన్ను ఇన్వాయిస్ అందుకున్నాడు..ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఆస్తిపన్నుగా రూ. 6.50 లక్షలు చెల్లించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version