అమ్మకి కేన్సర్ అని తెలియగానే అనాధ ఆశ్రమంలో వదిలేశా.. యాక్టర్ సుబ్బరాయ శర్మ

-

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుబ్బరాయ శర్మ. నాటక రంగంలో తన కెరీర్ను మొదలుపెట్టి టీవీ, సినీ నటుడుగా ఎదిగారు. ఇప్పటికి పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్న ఈయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..సుబ్బరాయ శర్మ మయూరి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో నటుడిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత మాయలోడు యమగోల, మాతృదేవోభవ, గంగోత్రి, ధర్మ చక్రం వంటి సినిమాలలో నటించారు. టాలీవుడ్ లో దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించిన సుబ్బరాయ శర్మ తన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కొన్ని పరిస్థితుల వల్ల తన తల్లికి ఆరోగ్యం బాలేని స్థితిలో అనాధాశ్రమంలో చేర్పించాల్సి వచ్చిందని తెలిపారు.

 

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. “1977 నుంచి టీవీలో పని చేస్తున్నాను. 1985లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్‌ మూవీ మయూరి. దీనికి వెయ్యి లేదా పదిహేను వందల రూపాయలు పారితోషికం ఇచ్చి ఉంటారు. ఒకానొక సమయంలో అమ్మకు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం హాస్పిటల్‌లో జాయిన్‌ చేయాల్సి వచ్చింది. అప్పటివరకు నా దగ్గర ఎలా ఉంటుందని అనాధాశ్రమంలో జాయిన్‌ చేశా. ఎందుకంటే అప్పుడు నా భార్య అమెరికాలో ఉంది. నేను తనను చూసుకోలేనని అనాధాశ్రమంలో పెట్టాను. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ అయ్యాక మళ్లీ అక్కడ దింపి షూటింగ్‌కు వెళ్లేవాడిని. ఆ డబ్బుతో ఆస్పత్రి బిల్లు కట్టాను. నా పరిస్థితి తెలుసుకుని గుణశేఖర్‌ నాకు పదివేలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అలా రెమ్యునరేషన్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టినవాళ్లే కాకుండా ముందుగా డబ్బులు ఇచ్చి ఆదుకున్న వాళ్లు కూడా ఉన్నారు సాయం చేసిన వాళ్లని ఎప్పటికీ మర్చిపోలేము కదా.. ” అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news