బుల్లితెర నటితో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విరూపాక్ష నటుడు..!

-

బుల్లితెర నటుడు రవికృష్ణ, నవ్య స్వామి జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సీరియల్స్ లో జంటగా నటించిన వీరిద్దరూ అప్పటినుంచి ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తూ కెమెరా కంట పడుతున్నారు. దీంతో వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి . ఇక అక్కడితో ఆగకుండా ఎంటర్టైన్మెంట్ షోలకి కూడా జంటగా వెళ్తూ అక్కడ లవ్ ట్రాక్ నడిపిస్తున్న తీరు అందరికీ కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అది ఎప్పటినుంచో నడుస్తోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ ఎప్పటినుంచో సమాధానాన్ని దాటవేస్తున్న రవి కృష్ణ తాజాగా మరొకసారి ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వక తప్పలేదు.. సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విరూపాక్షా సినిమాలో రవికృష్ణ నటించిన విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా అందులో నవ్య స్వామి తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించారు. ఇక ఆయన మాట్లాడుతూ సీరియల్ లోనే తాము మొదటిసారి కలుసుకున్నాము. అప్పటినుంచి తమ మధ్య మంచి స్నేహం ఏర్పడింది అంటూ రవి కృష్ణ తెలిపాడు.

నవ్య స్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం తాను కచ్చితంగా ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్షిప్ పై ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు రవి కృష్ణ. మొత్తానికైతే నవ్య స్వామికి రవికృష్ణని వివాహం చేసుకోవడం ఇష్టమైతే ఇక త్వరలోనే వీరి వివాహాన్ని మనం చూడవచ్చు అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా రవికృష్ణ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news