పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీలోకి చేరికలు జోరీగా సాగుతున్నాయి రాజకీయ నాయకుల తో పాటుగా వివిధ రంగాల్లో పేరు పొందిన వారు బిజెపి లో చేరుతున్నారు కొంత మంది పార్టీలో చేరి ఎంపి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఇంకొంతమంది ఎన్ డి ఏ కూటమికి సపోర్ట్ ని ఇస్తున్నారు.

కన్నడ సూపర్ స్టార్ గా పేరు పొందిన సుమలత అంబరీష్ బిజెపిలో చేరడానికి సిద్ధమయ్యారు 2019 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభివృద్ధిగా పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు సుమలత. ఎన్నికల తర్వాత బిజెపి ఆమెని రాజ్యసభ కి పంపే అవకాశము ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో ఆమె ఎన్ డి ఏ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు ఆమె ప్రచారం కర్ణాటకలో ఎన్డీఏ కూటమికి లాభం కలిగించబోతోంది.
