చిత్ర పరిశ్రమలో విషాదం…కరోనాతో ప్రముఖ నటి మృతి…!

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా కాటుకు మరో నటి బలైంది. మరాఠీ చిత్ర పరిశ్రమ లో మరియు టీవీ సీరియల్స్ లో నటించిన మాధవి గోగటే (58) ఈరోజు కన్నుమూసారు. ఇటీవల మాధవి కరోనా బారినపడ్డారు. దాంతో ఆమెకు ముంబైలోని సెవెన్ హిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు.

actress-madhavi died with corona
actress-madhavi died with corona

మాధవి మృతిపై ఆమె అభిమానులు… తోటి నటీనటులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ నటీ నటులు మాధవి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే మాధవి అశోక్ సరాఫ్ శాసన మరాఠీ సినిమా ఘన్ చక్కర్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా తుజా మజా జంటాయ్ అనే సీరియల్ లో నటించి ప్రశంసలందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మరణ వార్త విని ఆమె అభిమానులకు షాక్ అవుతున్నారు.