ఇందిరా పార్క్ లో ఒకడు లాక్కెళ్ళాడు…నటి స్నిగ్ధ ఎమోషనల్…!

ప్రతి మహిళ జీవితంలో ఒక్కసారైనా మగవారి నుండి వేధింపులు తప్పవేమో…అయితే చాలా మంది తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెప్పరు. కానీ కొంతమంది తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుని తమలా మరొకరు వేధింపులకు గురి కాకుండా చేస్తారు. తాజాగా టాలీవుడ్ నటి స్నిగ్ధ కూడా తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. స్నిగ్ధ అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

Actress snigdha emotional
Actress snigdha emotional

ఈ సినిమాలో అబ్బాయి లుక్ లో కనిపించి స్నిగ్ధ కామెడీని పండించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా స్నిగ్ధ అబ్బాయి గెటప్ లోనే నటిస్తూ కామెడీని పండించింది. అయితే ఎంతో చలాకీగా ఉంటూ నవ్వించే స్నిగ్ధ తాజాగా జీ తెలుగులో ప్రసారం అయ్యే సూపర్ క్వీన్ ప్రోమో లో ఎమోషనల్ అయ్యింది. తాను చిన్నవయసులో ఉన్నప్పుడు స్కూల్ కు వెళుతుంటే తన తండ్రి ఎవరి వద్దకు వెళ్లకు అని జాగ్రత్తలు చెప్పేవారని తెలిపింది. అయితే ఒకరోజు ఇందిరా పార్క్ లో ఆడుకుంటూ ఉండగా తనను ఒక వ్యక్తి లక్కెళ్ళాడు అని చెబుతూ కంటతడి పెట్టింది. ఆ తరవాత షోలో కార్తీక దీపం మోనిత కూడా తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది.