స్కూల్ వివాదం : లైవ్ లో ఏడ్చేసిన నటి మధుమిత

-

మా పిల్లల్ని అన్యాయంగా ఆన్లైన్ క్లాస్ నుంచి పీకేశారని సినీ నటి మధుమిత అన్నారు. జీవో 46కి విరుద్ధంగా తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆమె 50శాతం మాత్రమే స్కూల్ ట్యూషన్ ఫీజు కట్టాలని ప్రభుత్వం ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. తల్లిదండ్రులను పరీక్షల సమయంలో బెదిరిస్తున్నారని, నా పిల్లల్ని క్లాసెస్ నుంచి తీసేశారు కాబట్టి నేను బయటకు వచ్చానని అన్నారు.

ట్యాబ్ లు కొనలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని లక్షల మంది తల్లిదండ్రులకు అండగా నిలిచి.. పరిష్కారం చూపాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మధుమిత భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి మీద గౌరవంగా అడుగుతున్నామని మౌంట్ లిటేరా స్కూళ్లు ఫీజులతో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని మీరు చెప్పిన స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో క్షోభ కు గురిచేస్తున్నాయని ఆమె అన్నారు. నేను ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించానని, అయినా ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదని అన్నారు. విద్యార్థుల తల్లి దండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె కంట నీరు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version