ప్లాస్టిక్ సర్జరీపై నటి నయనతార సంచలన కామెంట్స్..

-

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథనాయికగా కొనసాగుతున్న హాట్ బ్యూటీ నయన్ తార గురించి ప్రస్తుతం ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా నయన్ ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. దీంతో తనకు సర్జరీ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఏజ్ పెరుగుతున్న కారణంగా ఈ సుందరి ఫేస్ సర్జరీ చేయించుకుందని అభిమానులు నెట్టింట కొత్త చర్చకు తెరలేపారు. మరికొందరు ఆ వార్తలను ఖండించారు.

ఇటువంటి కథనాలపై తాజాగా నయన్ స్పందిస్తూ..‘నేను ఫేస్‌కు ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. నేను ఎక్కువగా ఐబ్రోస్ చేయించుకోవడాన్ని ఇష్టపడతా.. కొన్నేళ్లుగా నా ఐబ్రోస్‌లో మార్పులు వస్తుండటంతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానని కొందరు భావించి ఉండొచ్చు ’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో నయన్ ఫ్యాన్స్ హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version