హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల భూముల వ్యవహరంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆ భూమిని వేలం వేసేందుకు సిద్ధమవ్వగా.. విద్యార్థులు, వర్సిటీ రిజిస్ట్రార్ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపారు.మంగళవారం కేబీఆర్ పార్క్ వద్ద హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్‌వీ నిరసన తెలపగా ‘సేవ్ ట్రీస్’ అనే ఫ్లకార్డు పట్టుకుని మణిశర్మ వారికి మద్దతు తెలిపారు. పలువురు రాజకీయ నేతలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.