ఆ గెటప్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చిన రాశి..!

-

టాలీవుడ్‌లో ఒకప్పుడు తన నటన, అందంతో ప్రేక్షకులను మైమరిపించిన హీరోయిన్ రాశి. వయస్సు పెరుగుతున్నా ఆమె అందం మాత్రం తగ్గట్లేదు. దాదాపు సీనియ‌ర్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించిన రాశి.. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూర‌మైంది. పైగా పెళ్లి తర్వాత రాశి బొద్దుగా తయారవడంతో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే అనుకున్నారు. కానీ, అందరినీ షాక్ చేస్తూ సగం బరువు తగ్గిపోయిన రాశి, ఇప్పుడు మళ్ళీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

అది కూడా పోలీస్ ఆఫీసర్ గెటప్‌ లో కనిపించబోతోంది. ఇప్పటికే రాశి ఫోటోలు ఇన్‌ స్టాగ్రాంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె పోలీసు అధికారిణిగా నటిస్తున్న కొన్ని సీన్లకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అప్ప‌ట్లో చాలా బొద్దుగా క‌నిపించిన రాశి ఇప్పుడు చాలా స్లిమ్‌గా క‌నిపించేస‌రికి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ చిత్రంతో  రాశీ త‌న అభిమానుల‌కి మంచి వినోదాన్ని అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఆమె ఇటీవలే ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అందులో వంట వీడియోలు పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version