గర్భంతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన శృతి

-

కాకపోతే నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసి బాగా పాపులర్ అయింది. మీటూ ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు శృతి… అర్జున్ పై ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది.

శృతి.. అంటే హాసన్ అనుకునేరు. కాదు.. హరిహరన్. అవును.. ఆమె పేరు శృతి హరిహరన్. కన్నడ ఇండస్ట్రీలో ఆమె పేరు అందరికీ సుపరిచితమే. అక్కడ పెద్ద స్టార్ హీరోయిన్ ఆమె. ఆమె తమిళంలోనూ చాలా సినిమాలు తీసింది.

కాకపోతే నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసి బాగా పాపులర్ అయింది. మీటూ ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు శృతి… అర్జున్ పై ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది.

అయితే.. ఆమెకు పెళ్లి అయిందన్న విషయం చాలామందికి తెలియదు. నటుడు, రచయిత అయిన ఓ వ్యక్తిని ఆమె గత సంవత్సరం పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకోవడానికి ముందే వాళ్లు నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నారట. కాకపోతే.. తన కెరీర్ కోసమో.. మరేదాని కోసమో… శృతి హరిహరన్.. తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది.

అయితే.. తను ప్రస్తుతం గర్భిణీ అన్న విషయం… ఆమె తన ఇన్ స్టాలో ఫోటోలు పెట్టే వరకు ఎవ్వరికీ తెలియదు. తనకు ఇప్పుడు 9 నెలలట.

నా జీవితం ఇప్పుడు నీ గుండె చప్పుళ్లతో ముడిపడి ఉంది. ఇది నా జీవితంలో మరో కొత్త ప్రయాణం. నీ రాకకోసం ఎక్కువ కాలం ఎదురు చూడలేను.. అంటూ క్యాప్షన్ పెట్టింది శృతి. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? ఓహో.. కంగ్రాడ్స్ శృతి.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version