నిరాడంబ‌రంగా ఎమ్మెల్యే ప్రేమ వివాహం

-

ఔను వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట్ట‌య్యారు.. కొంత‌కాలంగా ప్రేమ‌లో మునిగిపోయిన ఆ ఎమ్మెల్యే తాను ఇష్ట‌ప‌డిన యువ తిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడ‌య్యాడు. దీంతో వారివురి ల‌వ్‌స్టోరీకి శుభంకార్డు ప‌డిన‌ట్ల‌యింది. వివ‌రాల్లోకి వెళ్తే… త‌మిళ‌నాడులోని కళ్లకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రభు (34) ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అతి చిన్న వయస్సులోనే అన్నాడీఎంకే నుంచి అమ్మ జయలలిత ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన ప్ర‌భు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే.

త‌న నియోజ‌కవ‌ర్గంలోని త్యాగ దుర్గం మలై కోటైకి చెందిన సౌందర్య ప్రేమలతతో ఎమ్మెల్యేకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. దీంతో ఎమ్మెల్యే ప్రభు, సౌందర్య ప్రేమలత ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం సౌందర్య తిరుచంగోడులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. అయితే వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల్లో పెద్ద‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇక పెళ్లి పీట‌లు ఎక్కారు. ఈమేర‌కు సోమవారం ఎమ్మెల్యే ప్ర‌భు నివాసంలో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా ఈ ప్రేమ వివాహం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా ఈ జంట ఓ ఇంటివారయ్యారు. కాగా ప్రేమ వివాహం చేసుకున్న‌ ఎమ్మెల్యే ప్రభుకు పలువురు పార్టీ నేతలు, ప్ర‌జాప్ర‌తినిధులు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version