ట్రంప్.. ఇప్పటికీ మారవా.. డిశ్చార్జ్ అయి బయటకు రాగానే మాస్క్‌ పక్కన పడేసి !

-

కోవిడ్ -19 కోసం నాలుగు రోజుల అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్ లో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆసుపత్రి నుండి విడుదల అయ్యాడు. హాస్పిటల్ నుండి అతను వైట్ హౌస్ చేరుకున్న మరుక్షణం తన మాస్క్ ను తీసివేసి, త్వరలో ప్రచారం మొదలు పెట్టేందుకు వస్తానని శపథం చేశాడు. దానికి కొద్ది సేపటి ముందే దాదాపు 210,000 మందిని వైరస్‌తో కోల్పోయిన అమెరికన్లకు ఈయన కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.

అలానే సాయంత్రం 6.30 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్టు కొద్ది గంటల క్రితం ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మెరైన్ వన్ హెలికాప్టర్‌లో వైట్‌హౌస్‌కు వెళ్లారు. మొన్న శుక్రవారం కరోనా బారిన పడిన ట్రంప్ పని ఇక అయిపోయినట్టే అని అమెరికా మీడియాలో కధనాలు వచ్చాయి. దీంతో మన మీడియా కూడా ఈ అంశం మీద గట్టిగానే హడావుడి చేసింది. మనోడు మాత్రం మాస్క్ కూడా తీసి పారేసి షాకిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version