ఒక టీవీ సీరియల్ దర్శకుడితో ఓ నటి ఎఫైర్ పెట్టుకుంది. దీంతో ఆ డైరెక్టర్ ఆమెతోనే సహజీవనం చేస్తూ ఉండిపోయాడు. రోజూ రాత్రి సమయానికి ఇంటి కొచ్చే భర్త.. ఈ మధ్య అలా రాకపోవడంతో ఆ దర్శకుడి భార్యకి అనుమానం వచ్చింది. అప్పటినుంచి ఆమె తన భర్తపై సీక్రెట్ గా ఓ కన్ను వేసి ఉంచింది. ఈ క్రమంలోనే సదరు నటితో చాలా సన్నిహితంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న ఆమె.. ఓరోజు వారు కలిసుండగా ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. న్యూస్ 18 కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
రానురాను ఆమె ఆగడాలు ఎక్కువవడం, భర్త చూస్తూ సైలెంట్ గానే ఉండడం చూసి సహించలేకపోయిన అతని భార్య.. చివరికి పోలీసుల్ని ఆశ్రయించింది. తన భర్త కొన్నాళ్ల నుంచి ఆ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరూ తమ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారని, వాళ్లు నిత్యం తనని వేధిస్తున్నారని వాపోయింది. ఆ నటి వల్లే భర్త తనని ఇంట్లో నుంచి గెంటేశాడని, తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు.