బోర్డర్ వెంట సూసైడ్ బాంబర్లు.. తాలిబన్ కొత్త ఎత్తుగడ

-

ఆప్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తమ తలతిక్క నిర్ణయాలతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆప్గన్ లో తమ పాలను సుస్థిరం చేసుకునేందుకు, ఇతర దేశాల నుంచి ప్రమాదాలను తప్పించుకునేందుకు రక్షణగా కొత్తగా సూసైడ్ బాంబర్లతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ దళాలను ఆప్గనిస్తాన్- తజకిస్థాన్ సరిహద్దుల్లో బడాక్షన్ ప్రావిన్స్ లో ఏర్పాటు చేశారు. లష్కర్ ఈ మన్సూరీ లేదా మన్సూరీ ఆర్మీగా పిలవబడే ఈదళం నడుములకు పేలుడు పదార్థాలు చుట్టుకుని ఎప్పుడైనా ఆత్మాహుతి చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. గతంలో ఆప్గాన్ ప్రభుత్వ దళాలపై దాడులు చేయడానికి ఈ దళాలే కీలకంగా వ్యవహరించాయని బడాక్షన్ గవర్నర్ ముల్లా నాసిర్ అహ్మద్ అహ్మదీ అన్నారు. యూఎస్ బలగాలను ఓడించేందుకు ఈబలగాలే ప్రధాన భూమికను పోషించాయి. అయితే తాగా తజకిస్థాన్, ఆప్గన్ ప్రభుత్వంలోకి తజక్ జాతి ప్రజలకు కూడా ప్రాతినిథ్యం ఇవ్వాలని తాలిబన్లను డిమాండ్ చేస్తుంది. ఇటీవల తజకిస్తాన్, ఆప్గనిస్తాన్ సరిహద్దులోని రెండు రాష్ట్రాల్లో మిలటరీ పరేడ్ నిర్వహించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మరింత బలోపేతం చేసేందుకు ఈ సూసైడ్ ఆర్మీ ఉపయోగపడుతుందని తాలిబన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version