అక్టోబర్ రెండవ తేదీన నాధూరామ్ గాడ్సే అస్తికలు ఇంకా హిందూ మహాసభ హెడ్ క్వార్ట్రర్స్ లో ఉన్నాయని ఒక పోస్టు వచ్చింది. అయితే ఈ పోస్ట్ లో నిజం ఎంత…? ఇది నిజమైన వార్తా లేదంటే ఫేక్ న్యూస్ ఆ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అసలు ఆ వార్త గురించి చూస్తే… అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు నాధూరామ్ గాడ్సే యొక్క అస్తికలు హిందూ మహాసభ హెడ్ క్వార్ట్రర్స్ లో ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్టు వచ్చింది.
అయితే నిజంగా అస్తికలు ఇంకా ఉన్నాయా అని చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ట్విట్టర్ లో వచ్చిన సమాచారం ప్రకారం పూణే లో ఈ ఆస్తికలు ఉన్నాయని సింధూ నది లో వాటిని కలపాలని ఎప్పుడైతే సింధూ ప్రవహిస్తుందో అప్పుడు వాటిని కలపాలని అనుకున్నారట. అయితే ఈ పోస్ట్ ఫేక్ న్యూస్ కాదని నూటికి నూరు శాతం నిజం అని తెలుస్తోంది.
నదిలో కలిపే వరకు కూడా పూణే, శివాజీ నగర్ లో ఉంటాయని అస్థికల తో పాటుగా గాడ్సే దుస్తులు మరియు చేతితో రాసిన నోట్స్ కూడా ఆ గదిలో భద్రపరిచారు. ఒక వెండి బాక్సులో ఆస్తికలు భద్రపరిచారు. గాడ్సే బంధుమిత్రులు ఏమంటున్నారంటే అతన్ని ఉరి తీసిన తర్వాత శవాన్ని ఇవ్వలేదని ఆస్తికలిని ఉంచారని తెలుస్తోంది