పాకిస్థాన్ తన తప్పులను ఒప్పుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల విరమణ గురించి పాకిస్థాన్ కు స్పష్టమైన వైఖరి లేదని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘనీ మండిపడ్డారు. దీనిపై పాకిస్థాన్ వల్ల తప్పులు జరిగాయని, తాము ప్రశాంతతను కోరుతున్నామని, ఆఫ్ఘనిస్థాన్ ప్రశాంతతే పాకిస్థాన్ ప్రశాంతత అని పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ హై కౌన్సిల్ ఫర్ రీకన్సిలియేషన్ (హెచ్ సీఎన్ఆర్) చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం, పాకిస్థాన్ నేతలు బుధవారం సమావేశమయ్యారు. సమావేశంలో పలు దేశాల అధ్యక్షుడు పలు అంశాలపై చర్చించారు.
ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ లో కాల్పుల విషయంలో స్పష్టమైన వైఖరీ లేదని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఘనీ ప్రత్యేక దూత మహమ్మద్ ఉమర్ దౌడ్జాయ్ అన్నారు. దీనిపై స్పందించిన పాకిస్థాన్ అధ్యక్షడు అరిఫ్ అల్వీ తప్పును ఒప్పుకున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్ భద్రత ఉంటే పాకిస్థాన్ భద్రత ఉంటుందన్నారు. ప్రస్తుత పరిణామాలను, శాంతి ప్రక్రియ గురించి అబ్దుల్లా, అరిఫ్ అల్వీ బుధవారం చర్చలు నిర్వహించారు. కాగా, మంగళవారం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అబ్దుల్లాను కలిశారు. పాకిస్థాన్ తప్పులు చేసినట్లు భారత్ తో ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.