సూపర్ బ్యాటింగ్ తో చెలరేగిన రషీద్ ఖాన్… కంగారూల ముందు ఛేలెంజింగ్ టార్గెట్!

-

కాసేపటి క్రితమే ముంబై లోని వాంఖడే స్టేడియం లో ఆఫ్గనిస్తాన్ పసికూనలు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై చెలరేగి ఆడారు. ఒక మోస్తరు స్కోర్ కు సరిపెట్టుకుంటారు అనుకున్నా, చివరికి ఒక ఛాలెంజింగ్ టోటల్ ను కంగారూల ముందు ఉంచడంలో ఆఫ్ఘన్ టీం సక్సెస్ అయిందని చెప్పాలి. ఆస్ట్రేలియా బౌలింగ్ లో పూర్తిగా తేలిపోయింది. స్పీడ్ బౌలర్లుగా ఉన్న స్టార్క్ భారీగా పరుగులు ఇచ్చుకుని కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగా, హాజిల్ వుడ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ఆఫ్ఘన్ బ్యాటింగ్ లో ఇరగదీసింది…ఓపెనర్ ఇబ్రహీం సెంచరీ (129) తో చెలరేగగా, రషీద్ ఖాన్ (35), రహమత్ షా(30)లు అతనికి చక్కని సహకారం అందించారు. చివరికి ఆఫ్గనిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ ఉంది.. మరి తనకున్న బౌలింగ్ వనరులతో విజయం అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version