బీసీలు డిసైడ్ అయితే వార్ వన్ సైడే : ఎంపీ లక్ష్మణ్

-

ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ మాట్లాడారు. బీసీల గురించి కేసీఆర్ వ్యంగంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి మాకు కులం లేదన్నారు. 27 మంది కేంద్రంలో బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారు. ఈ చిన్న రాష్ట్రం నుంచి మొదటి రాజ్యసభ ఎంపీగా తనను ఎంపిక చేసింది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు. మీ ఓటు ఆయుధం ద్వారా సర్వం సిద్ధం కావాలని కోరారు.

తెలంగాణలో బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. బీసీలు డిసైడ్ అయిపోయారు బీసీని సీఎం చేయాలని.. బీసీలు డిసైడ్ అయితే వార్ వన్ సైడే అని పేర్కొన్నారు. బీజేపీ తరుపున 37 మంది బీసీ అభ్యర్థులను అవకాశం కల్పించింది బీజేపీ. ఆదివాసి బిడ్డను, దళితుడిని, శాస్త్రవేత్తను రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీనే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు.. వారి కుటుంబం నుంచి పదవులు చేపడుతారు. కానీ బీజేపీ అలా కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version