ఇది పూర్తి స్థాయి చంద్రగ్రహణం కూడా కాదు. ఇది పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే. 178 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో రాహువు, శని.. చంద్రడితో కలిసి ధనుస్సు రాశిలో ఉంటారు.
అప్పుడప్పుడు మనం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడటం చూస్తూనే ఉంటాం. అయితే.. ఇవాళ వచ్చే చంద్రగ్రహణానికి ఓ విశేషం ఉంది. ఎందుకంటే.. 150 సంవత్సరాల తర్వాత ఇటువంటి అరుదైన చంద్రగ్రహణం వస్తోంది. ఆషాఢ పౌర్ణమి రోజు వచ్చే చంద్ర గ్రహణం 150 సంవత్సరాల తర్వాత ఇదే మొదటి సారి. ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని కూడా అంటారు. 1870, జులై 12న ఇలాగే గురు పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడింది.
ఇవాళ ఏర్పడబోయే చంద్రగ్రహణం కూడా గురు పౌర్ణమి రోజే వస్తుండటం విశేషం. ఇవాళ రాబోయే చంద్రగ్రహణం… మంగళవారం రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో ఏర్పడి.. రెండో పాదంలో ముగుస్తుంది. అనగా… అర్ధరాత్రి 1.30 నిమిషాలకు ధనస్సు రాశిలో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 4.31 కు మకర రాశిలో ముగుస్తుంది.
అయితే.. ఇది పూర్తి స్థాయి చంద్రగ్రహణం కూడా కాదు. ఇది పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే. 178 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో రాహువు, శని.. చంద్రడితో కలిసి ధనుస్సు రాశిలో ఉంటారు.