బీజేపీ.. వైఎస్సార్సీపీ నాయకులను కూడా వదలడంలేదు. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతల లిస్ట్ ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు చేరిందట. దీంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీలోకి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయనే చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి జంప్ అయ్యారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే.. బీజేపీ కేవలం టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలకే గాలాలు వేసింది. వాళ్లే బీజేపీ ట్రాప్ లో పడ్డారు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు గాలం వేయలేదు. వేసినా పడరు.. అని అంతా అనుకున్నారు.
కానీ.. బీజేపీ.. వైఎస్సార్సీపీ నాయకులను కూడా వదలడంలేదు. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతల లిస్ట్ ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు చేరిందట. దీంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీలోకి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయనే చెప్పాలి.
ఆ ప్రయత్నాలు తోట వాణితో మొదలయ్యాయని అంటున్నారు. వైసీపీ మహిళా నేత ఆమె. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన తోట వాణి… టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఆమె ఓడిపోయినప్పటికీ.. ఆ నియోజకవర్గంలో ఆమెకు ఉన్న పాపులారిటీ వల్ల వాణికి ఏదో ఒక పదవి ఇస్తా అని జగన్ మాట కూడా ఇచ్చారట.
కానీ.. సడెన్ గా ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనుండటం.. వైసీపీ క్యాంపులో కలకలం లేపింది. ఇన్ని రోజులు టీడీపీ, కాంగ్రెస్ నేతలే బీజేపీలోకి క్యూ కడుతున్నారనుకుంటే.. వైసీపీ క్యాంపులోనూ కదలికలు మొదలవడంతో ఒకరిని చూసి మరొకరు.. ఇలా కొందరు అసంతృప్తులు కూడా వేరే మార్గం చూసుకుంటే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటి? అని నేతల్లో ఆందోళన నెలకొన్నది.
రంగంలోకి దిగిన సుజనా చౌదరి
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి… వాణితో పార్టీ మారే విషయమై మాట్లాడినట్టు తెలుస్తోంది. సుజనా చౌదరి.. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. బలమైన సామాజికి వర్గానికి చెందిన తోట వాణిని బీజేపీలో చేర్చుకోవడానికి పార్టీ హైకమాండ్ కూడా ఒప్పుకుందట. ఒకవేళ ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటే.. ఖచ్చితంగా ఏపీలో వైఎస్సార్సీపీకి ఇది తొలి షాక్ అవుతుంది. అయితే.. ఈ వార్తలపై వాణి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.