27 ఏళ్ల తరువాత ఇరానీ కప్ గెలిచిన ముంబై జట్టు..!

-

రెస్టాప్ ఇండియా-ముంబయి మధ్య జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగుల ఆధిక్యం కనబరిచిన ముంబయి జట్టు విజేతగా నిలిచింది. దాదాపు 27 ఏళ్ల తరువాత ముంబయి ఈ ట్రోప సాధించడం విశేషం. ఓవరాల్ గా ఆ జట్టు 15వ సారి విజేతగా నిలిచింది. ఐదోరోజు 153/6తో ఆట కొనసాగించిన ముంబయి.. 329/8తో నిలిచింది. ముంబయి రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో తనుష్ కొనియన్ (114), పృథ్విషా (76), మోహిత్ (51) పరుగులు చేశారు. తనుష్, మోహిత్ జోడీ తొమ్మిదో వికెట్ కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

మ్యాచ్ లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాగా ముగిస్తున్నట్టు ప్రకటించారు. సర్పరాజ్ 222 కి తోడు అజింక్యా రెహానె 97, శ్రేయస్ అయ్యర్ 57 రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో ముంబయి 537 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన రెస్టాప్ ఇండియా 416 పరుగులకే ఆలౌట్ అయింది. అభిమన్య ఈశ్వరన్ 191 త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్ 93 కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్ననాడు. మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

Read more RELATED
Recommended to you

Latest news