మొన్నీమధ్య హైదరాబాద్ లోని బొరబండలో భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. నిజానికి ఇక్కడ పెద్దగా భూ ప్రకంపనలు రాకున్నా శబ్దాలకే భయపడి పోయి జనాలు రెండు రోజుల పాటు బయటే గడిపారు. అయితే ఆ టెన్షన్ మరువక ముందే హైదరాబాదు గచ్చిబౌలి లోని టీ ఎన్ జీ ఓస్ కాలనీ లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. గత రాత్రి నుండి 6 సార్లు భూమీ కంపించిందని అంటున్నారు అక్కడి స్థానికులు.
అసలుకే కుండపోతగా వర్షం పడుతోంటే మరో పక్క ఈ ప్రకంపనలు కూడా రావడంతో టీఎన్జీఓస్ కాలనీ వాసులు భయాందోళనలో మునిగిపోయారు. అయితే అదంతా రాళ్ళూ రప్పలు ఉన్న ప్రాంతం కావడంతో భూమి లోపలికి నీరు వెళ్లి అలా సౌండ్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అలానే నానక్ రాం గూడలోని కొన్ని ఏరియాల్లో కూడా భూమిలో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల భూమి కంపించినట్టు అవుతోందని స్థానికులు చెబుతున్నారు. దీని మీద ఇంకా ప్రభుత్వం స్పందించలేదు.