బిగ్ సీక్రెట్‌ రివీల్ చేసిన తాప్సీ బాయ్‌ఫ్రెండ్….!

-

తాప్సీ బిగ్ సీక్రెట్‌ రివీల్ అయిపోయింది. చాలా సైలెంట్‌గా పని కానిచ్చేస్తోన్న తాప్సీ ఆధారాలతో సహా దొరికిపోయింది. బాయ్‌ఫ్రెండ్ అత్యుత్సాహంతో నెటిజన్ల దగ్గర అడ్డంగా బుక్ అయ్యింది తాప్సీ. దీంతో ఈ ఢిల్లీ బ్యూటీని ఒక రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.

తాప్సీ హాలిడే ట్రిప్‌ అని కొన్నిరోజులుగా బీచ్‌ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. చెల్లితో కలిసి ఫ్యామిలీ ట్రిప్‌ అని పోస్టులు పెడుతోంది. దీంతో తాప్సీ లాక్‌డౌన్‌ తర్వాత ఫ్యామిలీతో కలిసి చిల్‌ అవుతోంది అని అంతా అనుకున్నారు. కానీ తాప్సీ బాయ్ ఫ్రెండ్‌ మాతియస్ పెట్టిన ఒక ఫోటోతో తాప్సీ హాలిడే ట్రిప్ వెనకున్న అసలు రహస్యం బయటపడింది.

తాప్సీ బాయ్‌ఫ్రెండ్‌ డెన్మార్మ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియస్ బోయ్ రీసెంట్‌గా ఒక ఫోటో పోస్ట్‌ చేశాడు. తాప్సీతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటో షేర్ చేశాడు. హాలీడేని క్రేజీగా ఎంజాయ్‌ చేస్తున్నామని ట్యాగ్ చేశాడు. దీంతో తాప్సీని ఫుల్లుగా ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. వామ్మో ఫ్యామిలీ ట్రిప్‌ అని బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నావా అని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version