హైదరాబాద్ నగరాన్ని వర్షం ఇప్పుడే వదిలేట్టు కనిపించడం లేదు. ఈ వర్షం మళ్ళీ మొదలయింది. నగరంలో భారీగా వర్షం కురవడం మొదలయింది. దీంతో ఇప్పటికే వరద దెబ్బకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు మళ్ళీ వర్షం కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందకు పైగా కాలనీ లో వరద నీరు నిలిచే ఉంది.
కొద్ది సేపటి క్రితం సికింద్రాబాద్ తార్నాక బేగంపేట్ పంజాగుట్ట లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయింది. కూకట్పల్లి, బాలానగర్, మల్కాజ్గిరి నేరేడ్మెట్ లో కూడా భారీ వర్షం కురుస్తోంది. చార్మినార్, మొహంజాహీ మార్కెట్, పాతబస్తీలోని పలు చోట్ల కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే పురాణ ఫుల్ బ్రిడ్జి ఉంది. బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపి వేశారు అధికారులు.