Big News : అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి విజయవంతం..

-

అగ్ని-5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డమ్మీ వార్‌హెడ్స్‌తో అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని రాత్రిపూట భారత్ గురువారం నాడు విజయవంతంగా ప్రయోగించింది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి పరీక్షించారు. గతంలో కంటే అగ్ని-5 మిస్సైల్ తేలికగా ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అగ్ని-5 మిస్సైల్ సామర్ధ్యాన్ని ఈ ట్రయల్ రుజువు చేసిందని రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈ మిస్సైల్ ప్రయోగానికి ముందు బంగాళాఖాతం ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.

ఈ నెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్ లో చైనా, ఇండియా ఆర్మీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ తరుణంలో ఇండియా అగ్ని-5 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 5500 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా చేధించగలదు. అగ్ని-5 క్షిపణికి చెందిన అనేక రకాలు గతంలో విజయవంతంగా ప్రయోగించారు.

ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ఐసీబీఎం, అగ్ని5 ని దేశీయంగా డీఆర్‌డీఓ అభివృద్ది చేసింది. భారతదేశం అగ్ని-6 పై పని చేస్తుంది. ఇది జలాంతర్గాముల నుండి భూమి నుండి ప్రయోగించగలదు. 8 వేల నుండి 10 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలదు.గత రెండు దశాబ్దాలలో భారతదేశం అగ్ని-1, అగ్ని- 2, అగ్ని -3, అగ్ని -4, అగ్ని- 5 క్షిపణులను అభివృద్ది చేసి విజయవంతంగా ప్రయోగాలు చేసింది. డీఆర్‌డీఓ 2021లో కొత్త తరం అణు సామర్ధ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని పీ ని విజయవంతంగా పరీక్షించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version