ఏపీ మత్స్యకారులకు బిగ్ అలెర్ట్. మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
దీనిపై కేబినెట్‌లో చర్చించి ఈ జీవోను రద్దు చేస్తామని తెలిపారు. ఈ జీవోను రద్దు చేయాలని గత ప్రభుత్వ హయాంలో అనేక ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. ఇక అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు నిన్న ప్రవేశపెట్టారు. దీనికి తాజాగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించేశారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. మిగతా సభ్యులు అందరూ మద్దతు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా మందికి సమస్యలుండేవని ప్రస్తావించారు.