మైక్రోసాఫ్ట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో MOU ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/cm-revanth-reddy-8.jpg)
ఇక మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారమన్నారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి..
మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నానని ప్రకటించారు.
భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే: సీఎం రేవంత్ రెడ్డి
మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి
హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి
మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది
మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది… https://t.co/4jgoFTbKMa pic.twitter.com/53mqtcPRIN
— BIG TV Breaking News (@bigtvtelugu) February 13, 2025