జనాలను చితకబాదేందుకు ప్రయత్నించిన AI రోబో.. వీడియో!

-

ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎంత డేంజర్ అనేది మరోసారి నిరూపితమైంది. ఇది వర్క్ స్మార్ట్ చేయడమే కాకుండా భవిష్యత్‌లో మానవాళి మనుగడకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని ఇప్పటికే సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏఐ రాకతో పనులు సులభతరం అవ్వడమే కాకుండా మోసాలు సైతం పెరిగిపోయాయి.

ఇక ఏఐ రోబోలు మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి మనుషులకు శారీరక శ్రమను తగ్గిస్తున్నాయి. అయితే, చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. రోబో దాడి ప్రజలను ఒక్కక్షణం భయభ్రాంతులకు గురిచేసింది. వెంటనే పక్కనున్న వ్యక్తులు ఆ రోబోను కంట్రోల్ చేశారు.సాఫ్ట్‌వేర్ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని నిర్వహకులు చెప్పుకొచ్చారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news